యువతకు భారీ ఉపాధి: ఏడాదకి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నైపుణ్య విభాగం కింద ఐదు లక్షల నలభై మూడు వేల మందికి ఉపాధి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.