జగన్ రెడ్డిపై మండిపడిన కాకర్ల సురేష్: ఫ్యూడల్ మనస్తత్వం నేర చరిత్ర అంటూ ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాంతానికి చెందిన కాకర్ల సురేష్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన నేత అని, ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం నేర చరిత్రతో కూడుకున్నదని కాకర్ల సురేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఈ మేరకు ఆయన ఘాటైన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ విడుదల చేశారు.