చిన్న వ్యాపారుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ కేంద్రం కొత్త పెన్షన్ పథకం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

చిన్న వ్యాపారులు అలాగే స్వయం ఉపాధి చేసే వారికి భవిష్యత్తులో ఆర్థిక భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక విధానం ద్వారా అరవై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నెలకు మూడు వేల రూపాయల హామీ పెన్షన్ అందుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి వ్యాపారి తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.