దానం అనర్హత తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ వచ్చిన ఈ తీర్పు ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి చెంపపెట్టు వంటిదని ఆయన తీవ్రంగా స్పష్టం చేశారు.