కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన హనుమాన్ అంశ్ చిత్రబృందం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హనుమాన్ అంశ్ చిత్రబృందం సోమవారం ఆయన నివాసంలో కలిసింది. దర్శకుడు విశాల్ చతుర్వేది, ప్రధాన నటుడు శోభినావ్ సత్యా, నిర్మాత మహావీర్ జైన్ ఈ భేటీలో పాల్గొని, నీమ్ కరోలి బాబా గురించి, భారతీయ సాంస్కృతిక వారసత్వం ఆధారంగా తెరకెక్కబోయే రాంబోలా చిత్రం గురించి చర్చించారు.