గురుకులంలో విద్యార్థులతో పనులు: చిన్నారులతో వంటలు చేయిస్తున్న సిబ్బంది తీరుపై దుమారం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Thorrur

మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో సిబ్బంది విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నారని Telugu Scribe వెల్లడించారు. తొర్రూరు పట్టణంలోని ఈ పాఠశాలలో ఇటీవల ఓ విద్యార్థితో కట్టెలు కొట్టించగా, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల రక్షణను గాలికొదిలేసి ఇలాంటి పనులు చేయించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.