టీమిండియా చేతిలో ఘోర ఓటమి: పవర్‌ప్లే గుణపాఠం నేర్చుకోవాలన్న సాంట్నర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: వెల్లింగ్టన్
భారత్ చేతిలో ఘోర పరాజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన తెలిపారు. పవర్‌ప్లేలో ఏ విధంగా బ్యాటింగ్ చేయాలో ప్రత్యర్థి బ్యాటర్లను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు. భారత ఆటగాళ్ల ఉప్పెనను అడ్డుకోవడానికి సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు.