నాగావళి, వంశధార ఉగ్రరూపంతో జలదిగ్బంధంలో ఉత్తరాంధ్ర తీర గ్రామాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Srikakulam
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.