వ్యసనపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న నిరుపేద యువకుడి బతుకు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం పట్టణంలో అంబర్లు, గుట్కాలకు బానిసైన ఓ నిరుపేద దళిత యువకుడు దవడ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆ యువకుడి నోటిలో పురుగులు పడి దుర్భర పరిస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు వెంటనే స్పందించారు. ఫౌండేషన్ అధినేత అన్నం శ్రీనివాసరావు సహా సిబ్బంది యువకుడి వద్దకు చేరుకుని పురుగులను తొలగించి శుభ్రపరిచారు. తలస్నానం చేయించి, అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.