రైతన్నలకు తీపి కబురు: పశుగ్రాస సాగుకు ఎకరానికి 69 వేలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
వ్యక్తిగత భూముల్లో పశుగ్రాస సాగును ప్రోత్సహించేందుకు వీబీ జీరామ్జీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పశుగ్రాస కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. ఈ పథకం కింద ఎంపికైన అర్హులైన రైతన్నలకు రెండేళ్ల కాలపరిమితికిగాను ఎకరానికి గరిష్ఠంగా అరవై తొమ్మిది వేల ఏడువందల ఎనభై ఒక రూపాయి అందించనున్నారు. దీని ద్వారా పశుపోషకులు మెరుగైన జీవనోపాధి పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.