కారు లాకై ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ కారులోకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి తన్వితశ్రీ కారు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతుల కుమార్తె మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.