కన్నడ నటుడు దునియా విజయ్‌కు మొదటి భార్యతో విడాకులు మంజూరు
రిపోర్టర్: గోపి
స్థలం: బెంగళూరు
కన్నడ నటుడు దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న దంపతులకు బెంగళూరు హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. నాగరత్నకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును గౌరవిస్తున్నానని, తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అందరూ సంయమనం పాటించాలని విజయ్ కోరారు. 1999లో వివాహం చేసుకున్న వీరిద్దరూ సుదీర్ఘ కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ తీర్పుతో వారి విడాకుల వివాదానికి తెరపడింది.