పల్లె నిద్రతో ప్రజల్లో నమ్మకం పెంచుతున్న నెల్లూరు పోలీసులు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, గంజాయి విక్రయాల అరికట్టడంపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఏదైనా అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.