విధుల నిర్వహణలో ఎస్సై మృతి పట్ల సీపీ సజ్జనార్ సంతాపం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ట్యాంక్ బండ్ గణేష్ నిమజ్జన బందోబస్తులో విధులు నిర్వర్తిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని కొత్తగూడెం టూ-టౌన్ ఎస్సై కె.వెంకన్న తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ దుర్ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. ఎస్సై కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా నిలుస్తుందని, నిందితుడిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.