నాగ్‌పూర్‌లో ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య
రిపోర్టర్: హరి
స్థలం: Nagpur
నాగ్‌పూర్‌లోని ధంత్లీ ప్రాంతంలో పెళ్లికి నిరాకరించడంతో పాటు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. పూణేలో పీహెచ్‌డీ చేస్తున్న నిందితుడు పెళ్లికి నిరాకరించి బ్లాక్‌మెయిల్ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ధంత్లీ పోలీసులు నిందితుడిపై ఆత్మహత్య ప్రేరేపణ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.