తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఫడ్నవీస్ సానుకూలం

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును నూట యాభై రెండు మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఆదిలాబాద్ గిరిజనుల సాగునీటి అవసరాలను వివరించామని, రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.