హిందూ మహాసముద్రం వరకు యుద్ధం విస్తరిస్తుందంటూ ఇరాన్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగితే పశ్చిమాసియా యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు యహ్యా రహీం సఫావి హెచ్చరించారు. ఈ పరిణామం భారత్ ఇంధన దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. యుద్ధం కొనసాగితే పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి నుంచి ఈ ప్రాంతాలకు కూడా వివాదం వ్యాపించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంక్షోభం భారత్ ఆర్థిక భద్రతకు పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది.