నెల్లూరు కార్పొరేషన్ ఉత్కంఠ: డిప్యూటీ మేయర్ రేసులో పెరుగుతున్న ఆశావహులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఇరవై మూడో తేదీన ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. మేయర్గా రూప్కుమార్ యాదవ్ తో పాటు డెబ్బై రెండు మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కరే డిప్యూటీ మేయర్ ఉండనుండటంతో ఆ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.