కన్నుల పండుగగా వినాయకుని శోభాయాత్ర

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: తాడూరు

తాడూరు మండలం గోవిందయపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కనులవిందుగా సాగుతోంది. గణేష్ నవరాత్రులు ముగియడంతో వినాయకుని నిమజ్జనం చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. భక్తుల జయజయధ్వానాలు, మహిళల ఆటపాటలు, కోలాటాల మధ్య వినాయక స్వామి నిమజ్జన యాత్ర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.