ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే సునీల్ స్పష్టీకరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గతంలో కాలేజీలో ఎదురైన సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల సహకారంతో ఈ ఏడాది సుమారు 160 నుండి 180 మంది విద్యార్థులకు ఆన్ లైన్ అడ్మిషన్లు జరిగాయని పేర్కొన్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.