మురసు తుఫాన్ ప్రభావం: గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విమానాలు రద్దు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు నరసాపురం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో రాబోయే నూట ఇరవై గంటల పాటు తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లే సర్వీసులను నిలిపివేశారు.