లింగోజిగూడెంలో మహిళల కోలాహలం మధ్య ఘనంగా బతుకమ్మ వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం మూడో వార్డులో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన ఈ వేడుకలు మహిళల్లో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని భాజపా అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ పేర్కొంటూ మన సంప్రదాయాలను భావితరాలకు సముచితంగా అందించాలని ఆకాంక్షించారు.