వైకాపా రౌడీలను ఆస్ట్రేలియా వెళ్లినా వదిలిపెట్టబోమని మంత్రి లోకేశ్ హెచ్చరిక
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: అనంతపురం
విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి చేసిన వైకాపా రౌడీ బ్యాచ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అండమాన్ లేదా ఆస్ట్రేలియా వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్, పరిటాల రవీంద్రల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్సీ, మద్యం కుంభకోణాలపై చర్చకు రావాలని మాజీ సీఎం జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరారు.