డాక్టర్ కుర్చీలో డ్రైవర్ రోగులకు వైద్యం చేసిన వైనం

రిపోర్టర్: హరి స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని కాన్షీరామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోర్టు విచారణ నిమిత్తం డాక్టర్ రామ్‌కేశ్ బయటకు వెళ్లగా, ఆయన కారు డ్రైవర్ దేవ్‌ ఓపీడీ గదిలో డాక్టర్ కుర్చీలో కూర్చొని రోగులను పరీక్షించి మందులు రాసిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు తీవ్రంగా స్పందించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి, డ్రైవర్‌ను తొలగించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.