వర్ధన్నపేట: కోనా రెడ్డి చెరువు నీటి విడుదల.. రైతుల హర్షం

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేటలోని కోనా రెడ్డి చెరువు కింద వరినాట్లు వేసి నీరందక ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, టౌన్ ప్రెసిడెంట్ ఈగ దామోదర్ తూముల ద్వారా నీటిని విడుదల చేయించారు.

ఎలినోవా ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నీటి విడుదల ఊరటనిచ్చింది. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఏఈ అమర్నాథ్, కౌన్సిలర్లు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.