పంచాయతీ అనుమతులు లేకుండా క్వారీ ఏర్పాటుపై కలెక్టర్‌కు వినతి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 304లో గ్రామ పంచాయతీ ఎన్ఓసీ లేకుండా క్వారీ, క్రషర్ యూనిట్ ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్థులు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. గ్రామ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు.