క్వారీ అనుమతులపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
ఆకుతోటపల్లిలో పంచాయతీ ఎన్ఓసీ లేకుండా క్వారీ ఏర్పాటు చేస్తున్నారన్న గ్రామస్థుల ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు. ఈ క్వారీకి ఏయే శాఖల నుంచి అనుమతులు వచ్చాయనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆమంగల్ తహశీల్దార్ సంయుక్తంగా విచారణ జరిపి త్వరలోనే జాయింట్ నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.