గాంధీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సత్యం, అహింస మార్గంలోనే సమాజ పురోగతి సాధ్యమని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి వారు అందించిన సేవలు అనుసరణీయమని, స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్ర చిరస్మరణీయమని నగేష్ రెడ్డి కొనియాడారు.