నెల్లూరులో భారీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్: రూ. లక్ష కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో రూ. లక్ష కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మెగా రిఫైనరీ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లభించాయని అధికారులు తెలిపారు. రామాయపట్నం సమీపంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో ఈ ప్లాంటును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం.