అమితాబ్ బచ్చన్ సినిమా చూస్తూ నిద్రపోయానన్న కంటెస్టెంట్ పై సరదా కామెంట్లు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: జైపూర్
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో జైపూర్‌కు చెందిన అల్మాస్ ఖాన్ అనే కంటెస్టెంట్ చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాల్యంలో తన కజిన్స్‌తో కలిసి రాజ్ మందిర్ థియేటర్లో అమితాబ్ నటించిన మృత్యుదాత సినిమా చూసేందుకు వెళ్లానని, అయితే థియేటర్ వాతావరణం, ఏసీ చలికి తాను మధ్యలోనే నిద్రపోయి సినిమా పూర్తికాగానే లేచానని ఆమె అమాయకంగా చెప్పారు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ నిద్రపోతే సినిమా ఎలా చూశారంటూ సరదాగా నవ్వులు పూయించారు.