ఉత్తమ ఉపాధ్యాయుడిగా కావలి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట వెంకటేశ్వర్లు ఎంపిక
రిపోర్టర్: మహేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కావలి మండలం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాబోధన, పాఠశాల అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గాను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టర్ హిమాన్ష్ శుక్లా చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. విద్యా రంగంలో విశేష సేవలందించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది.