రాష్ట్రంలో ఉద్యోగుల డీఏలు మరియు సంక్షేమ పథకాలపై నేడు కేబినెట్ భేటీ

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు డీఏల మంజూరుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, నూతన సంక్షేమ పథకాలు, డిసెంబర్ నెలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గంలో కూలంకషంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు అని వర్గాలు వెల్లడించాయి.