భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి రామాయణం మొదటి భాగం విడుదల

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక రామాయణం మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రణబీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్ లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. మధ్యాహ్నం నాటికే భారతదేశంలో ఇరవై ఆరు కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిందని సాక్ నిల్క్ వెల్లడించింది. దీపావళి వీకెండ్ లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.