డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ ముఖ్యమంత్రికి నిలదీత
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
ఏపీలో డీఎస్సీ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోదని, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, తప్పుడు సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, టెట్ అర్హత లేకున్నా పోస్టులు ఇవ్వడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.