ఢిల్లీలో విద్యార్థినిని వెంబడించి కారులోకి లాగిన నిందితుల అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో హిందూ కాలేజీకి చెందిన ఓ మహిళా మాస్టర్స్ విద్యార్థినిని కారులో వెంబడించిన ఇద్దరు దుండగులు ఆమెను లాగేందుకు యత్నించారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. తొలుత పోలీసులు స్టేషన్ల పేరుతో తిప్పినప్పటికీ, చివరకు ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.