కలెక్టరేట్ ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ప్రజలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
నెల్లూరు కలెక్టరేట్ ఉద్యోగులు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా పాలన గాడిలో పడలేదు. ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారనే ఉద్దేశంతో గతంలో గేటుకు తాళాలు వేయించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆలస్యంగా వస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో పాలనా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.