బీజేపీ నేత రవ్‍నీత్ సింగ్ బిట్టు కాన్వాయ్ పై దాడి తీవ్రంగా ఖండించిన జై ఇందర్ కౌర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Pathankot, Punjab

పంజాబ్ లో బీజేపీ నేత రవ్‍నీత్ సింగ్ బిట్టు కాన్వాయ్ పై జరిగిన దాడిని పంజాబ్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జై ఇందర్ కౌర్ తీవ్రంగా ఖండించారు. పఠాన్ కోట్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రచారాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ పై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని, శాంతిభద్రతల వైఫల్యానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.