స్వర్ణాల చెరువు వద్ద గణేశ్ఘాట్ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద గణేశ్ఘాట్ను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉత్సవ సమితి సమీక్షలో ఆయన పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లపై కరపత్రాలు విడుదల చేశారు.