నెట్ఫ్లిక్స్ వేదికగా రణబాలి ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ స్ట్రీమింగ్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారని చిత్ర యూనిట్ తెలిపింది. రణబాలి నెవర్ ఫర్ గెట్ ట్రూత్ పేరుతో నాలుగు ఎపిసోడ్స్ గల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు వారు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వరుసగా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.