కృష్ణాష్టమి వేళ ఆకట్టుకుంటున్న బ్రహ్మాజీ ‘కృష్ణంభజే’ ఫస్ట్‌లుక్
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
కృష్ణాష్టమి సందర్భంగా ‘కృష్ణంభజే’ చిత్రం నుంచి నటుడు బ్రహ్మాజీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన మార్కండేయ పాత్రలో కాషాయ వస్త్రధారణతో ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు. నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో పౌరాణిక, భక్తిరస నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కలాల్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.