ముంబైలో భారీ దొంగతనం: రూ.25 లక్షల నగలు, నగదు మాయం
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
ముంబైలోని పవాయ్ ప్రాంతంలోగల ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. హిరానందాని గార్డెన్స్‌లోని పదిహేడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో తాళాలు పగలగొట్టకుండానే సుమారు ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయల విలువైన నగదు, బంగారం, డైమండ్ ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.