మొబైల్ యూజర్లకు తీపి కబురు: కేవలం రూ.15కే అన్లిమిటెడ్ 5జీ డేటా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్తగా సరికొత్త డేటా ప్లాన్ ను తీసుకువచ్చినట్లు టెలికాం వర్గాలు వెల్లడించాయి. కేవలం పదిహేను రూపాయల ధరతో ఇరవై నాలుగు గంటల వాలిడిటీతో అన్లిమిటెడ్ 5జీ డేటాను ఈ ప్యాక్ ద్వారా పొందవచ్చని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంటర్నెట్ వాడుకోవాలనుకునే కస్టమర్లకు ఈ కొత్త ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.