బాలీవుడ్ ఎంట్రీపై కల్యాణి ప్రియదర్శన్ ప్రత్యేక కసరత్తులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబయి

బాలీవుడ్లో అడుగుపెడుతున్న ప్రముఖ నాయిక కల్యాణి ప్రియదర్శన్ రణ్వీర్ సింగ్ సరసన నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ జాంబీ థ్రిల్లర్ చిత్రం కోసం ఆమె ముంబయికి మకాం మార్చారు. యాక్షన్ ఘట్టాల కోసం గత మూడు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ వర్క్షాప్లలో పాల్గొంటున్న ఈ భామ, అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో ఉత్తరాదిన తన ఇమేజ్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.