అమ్మవారి సన్నిధిలో మొక్కి ప్రజల సుభిక్షతను కోరిన ఎమ్మెల్యే వినోద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మందమర్రి పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి కామాఖ్య అమ్మవారిని దేవాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.