రెడ్డి జాగృతి సంస్థను రద్దు చేయాలని రాజ్యాధికార పార్టీ డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెద్దపల్లి

కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ, బహుజన, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులకు భంగం కలిగిస్తున్న రెడ్డి జాగృతి సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్.హెచ్ఓ నరేష్ కు పార్టీ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఈ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.