బీజేపీ తప్పుడు ప్రచారం బెడిసికొట్టిందంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ధ్వజం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: దిల్లీ
దీపావళి పండుగకు ముందు ఇండియా కూటమి ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలు దెబ్బతింటాయంటూ బీజేపీ చేసిన తప్పుడు ప్రచారం పూర్తిగా బెడిసికొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. దిల్లీ మార్కెట్లు కళకళలాడాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు భారీగా షాపింగ్ చేశారని తెలిపారు. ఓటు చౌర్యం అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కమలనాథులు కుట్ర పన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.