నా యాభై ఏళ్ల కెరీర్ లో అత్యంత భయంకరమైన పాత్ర ఇదేనంటూ మోహన్ బాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ది ప్యారడైజ్ సినిమాలో శికంజా మాలిక్ పాత్ర తన సినీ ప్రయాణంలోనే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించడం కోసం తన కెరీర్లో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక రీటేక్స్ తీసుకున్నట్లు తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, నాని అంకితభావం అద్భుతమని ఆయన ప్రశంసించారు.