ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా మహా గణపతిని ప్రత్యేకంగా పూజించి రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.