తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న వైనం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీకాకుళం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర మరియు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం - పొలాకి మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.