భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
రిపోర్టర్: సతీష్
స్థలం: Amaravati
రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో ఉభయ గోదావరి, విశాఖ సహా పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, రిజర్వాయర్లు మరియు చెరువులను నింపడంతో పాటు అవసరమైన చోట మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని ఆదేశించారు.